Telangana: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి జరిమానా

Hyderabad Traffic Police fine CM KCR Convoy Vehicle
  • పరిమితికి మించిన వేగంతో ప్రయాణించిన వాహనం
  • నాలుగుసార్లు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
  • పెండింగ్ చలాన్లు రూ. 4,140 చెల్లించిన సీఎంవో
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్వానాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేటలలో కేసీఆర్ కాన్వాయ్ వాహనం పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకు గాను ట్రాఫిక్ పోలీసులు నాలుగు సార్లు జరిమానా విధించారు. మొత్తం రూ. 4,140 చలాన్లు పంపారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పెండింగులో ఉన్న ఈ చలాన్లను చెల్లించారు.
Telangana
KCR
Convoy
traffic police
Hyderabad

More Telugu News