Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో బాలీవుడ్ భామ!

Kaira Advani in Sarkar Vari Pata
  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
  • ఆసక్తి చూపుతున్న కైరా అద్వానీ
  • బాలీవుడ్ సినిమాలతో ప్రస్తుతం బిజీ
బాలీవుడ్ భామ కైరా అద్వానీ మరోసారి మహేశ్ బాబుతో జతకట్టనుంది. ఆమధ్య వీరిద్దరూ కలసి నటించిన 'భరత్ అనే నేను' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచీ మళ్లీ ఈ జంట ఎప్పుడు జోడీ కడుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కైరా త్వరలో మహేశ్ సరసన నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం తర్వాత మహేశ్ తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనికి 'సర్కారు వారి పాట' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించిన సంగతి, ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి విదితమే. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో చిత్రం యూనిట్ ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ, ఈ సినిమా పట్ల కైరా ఆసక్తి చూపుతోందని తాజా సమాచారం. తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం కోసం ఈ ముద్దుగుమ్మ డేట్స్ అడ్జస్ట్ చేసుకోనుందట.
Mahesh Babu
Kaira Advani
Parashuram
Sarkaru Vari Pata

More Telugu News