Nisarga: తీరం దాటిన నిసర్గ... అల్లకల్లోలంగా మహారాష్ట్ర తీరప్రాంతం

  • అలీబాగ్ వద్ద తీరం దాటిన నిసర్గ
  • తీరం దాటిన సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్లు
  • అన్ని బీచ్ లలో సెక్షన్ 144
Cyclone Nisarga makes landfall close to Mumbai

నిసర్గ తుపాను ముంబైకి సమీపంలో ఉన్న అలీబాగ్ వద్ద తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్ల వేగంగా ఉంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిసర్గ ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

మహారాష్ట్రలోని అన్ని బీచ్ లలో సెక్షన్ 144 ప్రకటించారు. తీరం దాటిన మూడు గంటల్లోగా తుపాను ముంబై, థానే జిల్లాలోకి ప్రవేశించనుంది. మరోవైపు ఇప్పటికే కరోనాతో అల్లకల్లోలంగా మారిన మహారాష్ట్రకు ఈ తుపాను పెను విపత్తుగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న రోగులను, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 48 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

More Telugu News