Lands: భూముల రీసర్వేకు అనుమతులిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

AP govt issues order for re survey of lands
  • రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే
  • రీసర్వేకు రూ. 200 కోట్ల విడుదల
  • 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని భూముల రీసర్వేకు ఉత్తర్వులు జారీ చేసింది. కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ ద్వారా రీసర్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి. రీసర్వే కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. రీసర్వే చేయడానికి రూ. 200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గత టీడీపీ హయాంలో కూడా భూదార్ కార్యక్రమం కోసం పైలట్ ప్రాజెక్టుగా రూ. 3.20 కోట్లు ఖర్చు చేశారు.
Lands
Re Survey
Andhra Pradesh

More Telugu News