Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు

Sexual Harassment case against actor Nawazuddin Siddiqui brother
  • నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడిపై కేసు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వరుసకు కూతురయ్యే మహిళ
  • 9 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కేసు
బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవలి కాలంలో పలు వివాదాలకు సంబంధించి పతాక శీర్షికల్లో నిలుస్తున్నాడు. విడాకులు కోరుతూ ఆయన భార్య నోటీసులు  పంపిన వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయన కుటుంబానికి సంబంధించిన మరో ఘటన కలకలం రేపుతోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని వారికి వరుసకు కూతురు అయ్యే జమీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు రెండేళ్ల వయసున్నప్పుడు అమ్మ, నాన్న విడిపోయారని... ఆ తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న (నవాజుద్దీన్ తమ్ముడు) తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. ఎంతో హింసకు గురయ్యానని తెలిపారు. తనకు అప్పుడు విషయం అర్థమయ్యేది కాదని... పెద్దయ్యాక అతని చేష్టలు అర్థమయ్యాయని చెప్పారు. తనకు పెళ్లైన తర్వాత కూడా వారి నుంచి వేధింపులు తగ్గలేదని... తమ అత్తారింటిపై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకరోజు పెదనాన్న నవాజుద్దీన్ తనతో మాట్లాడుతూ, 'ఏం కావాలనుకుంటున్నావ్?' అని అడిగారని... ఆ సమయంలో చిన్నాన్న చేస్తున్న వేధింపులను గురించి చెప్పానని... అయితే ఆయన మాత్రం 'అతను నీ చిన్నాన్న. ఎప్పుడూ అలా వ్యవహరించడు' అని చెప్పారని అన్నారు. పెదనాన్న తనను అర్థం చేసుకుంటారని అనుకున్నానని... అయితే, అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Nawazuddin Siddiqui
Bollywood
Brother
Sexual Harrassment

More Telugu News