Andhra Pradesh: ఏపీ మంత్రి శంకరనారాయణ సోదరుడి కుటుంబంలో ముగ్గురుకి కరోనా పాజిటివ్!

Minister Shankaranarayana family members tested corona positive
  • ఇటీవలే మరణించిన మేనత్తకు కరోనా పాజిటివ్
  • ముందస్తు జాగ్రత్త పరీక్షలు చేయించుకున్న మరో 17 మంది
  • వైసీపీ నేతలు, కార్యకర్తల్లో కలవరం 
ఏపీ మంత్రి శంకరనారాయణ సోదరుడి కుటుంబంలో ముగ్గురుకి కరోనా సోకడంతో కలకలం రేగింది. దీంతో ఆయనను కలిసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా పెనుకొండలో 17 మందికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు, మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ చేసి, రసాయనాలతో శానిటైజ్ చేశారు.

మంత్రి నారాయణ మేనత్త ఇటీవలే కన్నుమూశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా... మంత్రి సోదరుడు సహా ముగ్గురికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో, వీరిని ఓ పాఠశాలలోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. కరోనా పరీక్షలు చేయించుకున్న ఇతరుల్లో  మంత్రి పీఏ, ఫొటోగ్రాఫర్ తదితరులు ఉన్నారు.
Andhra Pradesh
YSRCP
Minister
Shankaranarayana
Corona
Penukonda

More Telugu News