Chiranjeevi: తెలంగాణ గవర్నర్ ను కలిసిన చిరంజీవి దంపతులు

Chiranjeevi meets TS Governor Tamilisai
  • సతీ సమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన చిరంజీవి
  • గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
  • అంతకు ముందు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పిన చిరు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. ట్విట్టర్ ద్వారా కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో మీరు మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Chiranjeevi
Tamilisai Soundararajan
Tollywood

More Telugu News