Venkatesh: కరోనా వైరస్, లాక్ డౌన్ ముగింపుపై హీరో వెంకటేశ్ ట్వీట్!

Actor Venkatesh comments on lockdown
  • ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ గేట్లు తెరుచుకుంటున్నాయి
  • అందరూ బాధ్యతగా వ్యవహరించాలి
  • సామాజిక దూరం పాటిస్తూ, సేఫ్ గా ఉండాలి
లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సినీ హీరో వెంకటేశ్ హెచ్చరించారు. ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పంపారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి గత 70 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అందరి సంక్షేమం కోసం రాత్రింబవళ్లు పని చేసిన సిబ్బందికి థ్యాంక్స్ చెపితే సరిపోదని చెప్పారు.

ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ గేట్లు తెరుచుకుంటున్నాయని... ప్రజలంతా ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. లాక్ డౌన్ మాత్రమే చివరి దశకు వచ్చిందని... వైరస్ కాదని అన్నారు. లాక్ డౌన్ సమయంలో మనం పాటించిన జాగ్రత్తలన్నీ కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ, సేఫ్ గా ఉండాలని అన్నారు.
Venkatesh
Lockdown
Tollywood

More Telugu News