Imran Khan: లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు.. ప్రజలంతా కరోనాతో కలిసి జీవించాలి: ఇమ్రాన్ ఖాన్

  • లాక్ డౌన్ వల్ల దేశ ఆదాయం పడిపోయింది
  • ఇకపై తట్టుకునే శక్తి పాకిస్థాన్ కు లేదు
  • పేదలకు ఎన్ని రోజులు సాయం చేయగలం
No use with lockdown says Imran Khan

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను త్వరలోనే ఎత్తివేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని, వైరస్ ను అది అరికట్టలేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్ తో కలిసి జీవించాలని అన్నారు. సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నగదు బదిలీ చేశామని... ఇకపై ఎవరికీ సహాయం అందించలేమని స్పష్టం చేశారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

లాక్ డాన్ వల్ల దేశ ఆదాయం దారుణంగా పడిపోయిందని... ఇకపై నష్టాన్ని తట్టుకునే శక్తి పాకిస్థాన్ కు లేదని ఇమ్రాన్ తెలిపారు. పేదలకు సాయం చేసేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని... అయినా ఎన్ని రోజులు ఆర్థిక సాయం చేయగలమని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అది విస్తరిస్తూనే ఉంటుందని... అందువల్ల దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని చెప్పారు. అమెరికాలో లక్ష మంది కరోనాతో చనిపోయారని... అయినా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే కారణంతో అక్కడ తిరిగి ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించారని అన్నారు. వైరస్ ను అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లేకపోతే ప్రతిఫలాన్ని అనుభవిస్తారని తెలిపారు.

More Telugu News