Meera Chopra: తీవ్ర ఆవేదనతో జూనియర్ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసిన మీరా చోప్రా

Meera Chopra tweets Junior NTR and complained on his fans
  • ఎన్టీఆర్ కంటే మహేశ్ అంటేనే ఇష్టమన్న మీరా చోప్రా
  • తారక్ ఫ్యాన్స్ తనను దూషిస్తున్నారంటూ మీరా చోప్రా ట్వీట్
  • తన ట్వీట్ పట్ల స్పందించాలంటూ జూనియర్ ఎన్టీఆర్ కు విజ్ఞప్తి
తెలుగులో కొన్ని సినిమాలు చేసిన మీరా చోప్రా అనూహ్యరీతిలో తెరపైకి వచ్చారు. తనను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశారు.

"తారక్...  మీ అభిమానులు నన్ను ఓ వేశ్య, అశ్లీల నటి అని పిలుస్తారని అనుకోలేదు. మీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడమే దీనికంతటికీ కారణం అనుకుంటున్నా.  కానీ మీ అభిమానులు నా తల్లిదండ్రులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు ఫీలవుతున్నారా? మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను" అంటూ తారక్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మీరా చోప్రా బంగారం సినిమాలో పవన్ కల్యాణ్ సరసన కూడా నటించింది.

Meera Chopra
Jr NTR
Fans
Mahesh Babu
Tollywood

More Telugu News