Manoj tiwari: మనోజ్ తివారికి షాక్ ఇచ్చిన బీజేపీ!

Manoj Tiwari terminated from Delhi BJP President post
  • బీజేపీ చీఫ్ గా ఆదేశ్ కుమార్ నియామకం
  • ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం
  • ఛత్తీస్ గఢ్, మణిపూర్ లో కూడా అధ్యక్షుల మార్పులు
ఢిల్లీ బీజేపీ చీఫ్, భోజ్ పురి సినీ స్టార్ మనోజ్ తివారీకి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయనను ఢిల్లీ చీఫ్ పదవి నుంచి తొలగించి... ఆయన స్థానంలో ఢిల్లీ మాజీ మేయర్ ఆదేశ్ కుమార్ గుప్తాను నియమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని బీజేపీ హైకమాండ్ ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగానే మనోజ్ తివారీపై వేటు వేసింది.

ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో కూడా మార్పులు, చేర్పులు చేసింది. ఛత్తీస్ గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణు డియో సాయి, మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడిగా టికేంద్ర సింగ్ లను నియమించింది.

వాస్తవానికి ఎంతో చరిష్మా ఉన్న మనోజ్ తివారీ నాయకత్వంలో ఢిల్లీలో బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలనే సాధించింది. 2017 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ప్రతిభను కనబరిచింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ పార్టీ ప్రక్షాళనను ప్రారంభించింది.
Manoj tiwari
Delhi
Bjp
President

More Telugu News