Narendra Modi: ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చర్యలు ప్రారంభం.. ఐదు 'ఐ'లపై దృష్టి: మోదీ

modi on corona
  • సీఐఐ 122వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగం
  • కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టి
  • ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లపై దృష్టి
  • భారత ఆవిష్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉంది
దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) 122వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో తాము కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టామని చెప్పారు.

దీర్ఘకాల దృష్టితో చర్యలు తీసుకుంటున్నామని మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు 'ఐ'లపై దృష్టి సారించామని తెలిపారు. ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లపై దృష్టి పెట్టామని వివరించారు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మోదీ చెప్పారు. భారత ఆవిష్కరణలపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందని తెలిపారు. విపత్కర సమయంలో తాము ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు మేడిన్‌ ఇండియాకు ప్రోత్సాహమిస్తున్నామని చెప్పారు.
Narendra Modi
BJP
India
Corona Virus

More Telugu News