India: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలే వానలు!

  • ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశం
  • ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
  • నేడు తుపానుగా మారనున్న అల్పపీడనం
Southwest Monsoon touches Kerala yesterday

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఇక దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు కురవనున్నాయి. రుతుపవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ సీజన్‌లో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు.

మరోవైపు, అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్-దమణ్‌ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు.

More Telugu News