తెలంగాణలో బీజేపీ సీనియర్ నేతకు కరోనా... అపోలో ఆసుపత్రిలో చికిత్స!

01-06-2020 Mon 20:41
  • కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
  • తెమడ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ
  • కరోనా భయంతో ఆసుపత్రిలో చేరిన భార్య, కొడుకు
BJP senior leader tested corona positive in Telangana
తెలంగాణలో కరోనా రక్కసి రెక్కలు చాచి విజృంభిస్తోంది. తాజాగా ఓ సీనియర్ రాజకీయ నాయకుడు కరోనా బారినపడ్డాడు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం.... కరోనా అనుమానిత లక్షణాలతో ఆ మాజీ ఎమ్మెల్యేని ఆదివారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన తెమడ నమూనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ ఆసుపత్రికి పంపగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ మాజీ శాసనసభ్యుడికి పాజిటివ్ అని తేలడంతో ఆయన భార్య, కొడుకు కూడా ఆసుపత్రిలో చేరారు. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపారు.