Singapore: సింగపూర్ నుంచి రావాలనుకుంటున్న వారు వివరాలను పంపించండి: మోహన్ బాబు

Those who wants to come from Singapore can send their details says Mohan Babu
  • సింగపూర్ నుంచి హైదరాబాదుకు స్పెషల్ ఫ్లైట్
  • విమానాన్ని ఏర్పాటు చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం
  • అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించిన మోహన్ బాబు
కరోనా వైరస్ కారణంతో మన దేశానికి చెందిన ఎంతో మంది ప్రజలు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. వారిని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు, సింగపూర్ తెలుగు సమాజం అక్కడి నుంచి హైదరాబాదుకు ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. వచ్చే వారం ఈ విమానం వస్తోందని ఆయన వెల్లడించారు. సింగపూర్ లో చిక్కుకుపోయిన వారు తిరిగి రావడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మీరు కాని, మీ కుటుంబీకులు కాని ఈ విమానంలో రావాలనుకుంటే.. [email protected] కి మీ వివరాలను పంపించాలని సూచించారు.
Singapore
Hyderabad
Flight
Mohan Babu
Tollywood

More Telugu News