Jacob Thomas: ఆయన రూటే సెపరేటు.. పదవీవిరమణ రోజున ఆఫీసులో నేలపై నిద్రించిన కేరళ సంచలన ఐపీఎస్ అధికారి!

Jacob Thomos slept last working day in office
  • పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి జాకబ్ థామస్
  • సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న థామస్  
  • 35 ఏళ్ల పాటు పోలీసు శాఖకు సంబంధించని పదవుల్లోనే 
కేరళ ఐపీఎస్ అధికారి జాకబ్ థామస్ పదవీ విరమణ చేశారు. అయితే, తన చివరి రోజును ఆయన ఆఫీసులో నేలపై నిద్రించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత నేలపై వేసిన బెడ్ షీట్ ఫొటోను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సివిల్ సర్వీసెస్ చివరి రోజు ప్రారంభమైంది. కార్యాలయంలోనే నిద్ర అని ఆయన కామెంట్ చేశారు.

జాకబ్ థామస్ చాలా సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. విశేషం ఏమిటంటే, తన కెరీర్ మొత్తంలో దాదాపు 35 ఏళ్ల పాటు ఆయన పోలీసు శాఖకు సంబంధంలేని పదవుల్లోనే కొనసాగారు. వివిధ శాఖల్లో ఆయనను డిప్యుటేషన్ పై పంపారు. పదవీ విరమణ కూడా లోహ పరిశ్రమల ఎండీ హోదాలో చేశారు.
Jacob Thomas
Retirement
Kerala
IPS

More Telugu News