gas: దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

  • మెట్రో నగరాల్లో రూ.37 వరకు పెరిగిన ధర
  • ఢిల్లీలో రూ.11.50 పెరుగుదల
  • కోల్‌కతాలో రూ.31.50
  • ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగిన ధర
Non Subsidised Cooking Gas Costlier By Up To Rs 37 Cylinder In Metros

దేశంలో వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర పెరిగింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై ఈ రోజు మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. కొన్ని నెలల పాటు వరుసగా భారీగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పెరగడం గమనార్హం. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది.

 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరింది. కోల్‌కతాలో నిన్నటి వరకు రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో నిన్నటి వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో నిన్నటి వరకు రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది.  

More Telugu News