Bihar: ఇదే భారతీయుల్లో సోదరభావం, ఐక్యత... నిదర్శనంగా నిలిచిన వైరల్ వీడియో!

Viral Video of biharies Giving food to Mizoram Migrents Train
  • మిజోరంకు బయలుదేరిన శ్రామిక్ రైలు
  • మార్గమధ్యలో బిగూసరాయ్ వద్ద ఆగిన రైలు
  • కార్మికులకు ఆహారాన్ని అందించిన బీహారీలు
వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైల్లో మిజోరం రాష్ట్రానికి వెళుతున్న కూలీలకు, మార్గమధ్యంలో బీహార్ వాసులు ఆహారాన్ని అందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. రైలు ఆగగానే, వారిని చూసి, అప్పటికే సిద్ధంగా ఉంచిన ఆహార పొట్లాలను వారికి అందించిన ఘటన బిగూసరాయ్ సమీపంలో జరిగింది. మనసును హత్తుకునేలా ఉన్న ఈ వీడియోను రైల్లోని ఓ మిజోరం వాసి తన స్మార్ట్ ఫోన్ లో బంధించగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరాంథంగా తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇటువంటి ప్రేమానుబంధాలతో భారత్ మరింత అందంగా కనిపిస్తోందని దీనికి కామెంట్ పెట్టారు.

అర నిమిషం నిడివి వున్న వీడియోను చూసిన వారంతా, ఇది భారతీయుల ఐక్యతను చాటిందని ప్రశంసిస్తున్నారు. ఇండియన్స్ లోని సోదరభావం, ఐక్యతకు ఈ వీడియో నిదర్శనమని, భారత్ అంటే ఇదేనని, ఇంత మంచి వీడియోను చూపినందుకు ధన్యవాదాలని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరికొందరు ఈ వీడియోను చూసి ఆనందబాష్పాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.
Bihar
Mizoram
Sramik Train
Migrents
Food
Biharies
Viral Videos

More Telugu News