Bangladesh Cricket Board: తన జీతంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితులకు ఇవ్వనున్న కివీస్ మాజీ కెప్టెన్

Daniel Vettori to donate part of salary to help Bangladesh Cricket Board
  • బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరి
  • రూ. 1.88 కోట్ల వేతనం అందుకోనున్న మాజీ కెప్టెన్
  • ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇవ్వాలని బీసీబీని కోరిన వైనం
కివీస్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి తన వేతనంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరాడు. జులై 2019లో బాధ్యతలు చేపట్టిన వెటోరి.. టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు గాను రూ. 1.88 కోట్ల వేతనాన్ని అందుకోనున్నాడు. అందులో కొంత మొత్తాన్ని కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అందించాల్సిందిగా బీసీబీని కోరాడు. అయితే, ఎంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నదీ వెల్లడించలేదు.
Bangladesh Cricket Board
Daniel Vettori
Corona Virus
Team New Zealand

More Telugu News