Vinish Fogat: ఈసారైనా దక్కేనా? ఖేల్ రత్న పురస్కారానికి మరోసారి వినేశ్ ఫొగాట్ పేరు!

vinesh Fogat Get anothe Chance for Rajive Khel Ratna
  • 2019లో బజరంగ్ పునియాకు అవార్డు
  • ఈ సంవత్సరం వినేశ్ పేరును ప్రతిపాదించిన రెజ్లింగ్ సమాఖ్య
  • అర్జున అవార్డుకు పోటీలో పలువురు రెజ్లర్లు  
గత సంవత్సరమే అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు నామినేట్ అయినప్పటికీ, చివరి క్షణంలో దాన్ని దక్కించుకోలేకపోయిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్, ఈ సంవత్సరం కూడా అదే పురస్కారానికి పోటీ పడనుంది. గత సంవత్సరం బజరంగ్ పునియా అడ్డుగా ఉండటంతో, వినేశ్ కు పురస్కారం దక్కలేదు. ఈ సంవత్సరం మాత్రం అవార్డు ఆమెనే వరిస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం, ఆసియా చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన వినేశ్, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో సైతం పోటీ పడనుందన్న సంగతి తెలిసిందే. ఆమె పేరును ఖేల్ రత్న పురస్కారం కోసం సిఫార్సు చేయాలని రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయించింది. సాక్షి మాలిక్ ను అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు దీపక్ పునియా, సందీప్ తోమర్ లతో పాటు రాహుల్ అవారేలు ఇదే అవార్డు కోసం పోటీగా నిలిచారు.
Vinish Fogat
Rajive Khel Ratna
Bhajarang Puniya

More Telugu News