ISS: 19 గంటల ప్రయాణం తరువాత... ఐఎస్ఎస్ లోకి చేరిన వ్యోమగాములు.. వీడియో ఇదిగో!

  • ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ నిర్వహించిన ప్రయోగం
  • ఐఎస్ఎస్ చేరిన బాబ్ బెన్ కెన్, డౌగ్ హార్లీ
  • స్వాగతం పలికిన అమెరికా, రష్యా వ్యోమగాములు
Astronats Reach Space Station after 19 Hours Journey

దాదాపు 19 గంటల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత నాసా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోగా, అక్కడ ఉన్న ఆస్ట్రొనాట్స్, కాస్మోనాట్స్ వారికి స్వాగతం పలికారు. ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ తొలిసారిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించి, వ్యోమగాములను అంతరిక్షానికి చేర్చడంలో విజయం సాధించింది.

బాబ్ బెన్ కెన్, డౌగ్ హార్లీలు ప్రయాణించిన రాకెట్, మధ్యాహ్నం 1.02 గంటలకు (17.02 జీఎంటీ) వీరు ఐఎస్ఎస్ చేరారు. బ్లాక్ పోలో షర్ట్, ఖాకీ ప్యాంట్ ధరించిన బెన్ కెన్ తొలుత, ఆయన వెంట హార్లీ స్పేస్ స్టేషన్ లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఉన్న యూఎస్ ఆస్ట్రొనాట్ క్రిస్ క్యాసిడీ, రష్యా కాస్మొనాట్స్ అనతొలి వానిషిన్, ఇవాన్ వాంగర్ స్వాగతం పలికారు.

హూస్టన్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్ స్టయిన్ రాకెట్ క్రూతో మాట్లాడారు. "బాబ్, డౌగ్ మీకు సుస్వాగతం. ఈ మిషన్ ను ప్రపంచమంతా చూసిందని నేను మీకు చెబుతున్నాను. దేశం కోసం మీరు చేస్తున్న కార్యక్రమం మాకెంతో గర్వకారణం" అని అన్నారు.

More Telugu News