Hardhik Pandya: ఫ్యాన్స్ కు షాకిస్తూ పెళ్లి ఫోటో... ఆ వెంటనే తండ్రిని కాబోతున్నానని ప్రకటించిన హార్దిక్ పాండ్యా!

Hardhik Pandya Shock to Fans with Marriage Pics
  • జనవరి 1న సెర్బియా నటి నటాషాతో నిశ్చితార్థం
  • జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టనున్నాం
  • ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన హార్దిక్ పాండ్యా  
ఈ సంవత్సరం ఆరంభంలో జనవరి 1న సెర్బియాకు చెందిన నటి, మోడల్ నటాషా స్టాన్ కోవిచ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న హార్దిక్ పాండ్యా, తాను త్వరలో తండ్రిని కాబోతున్నానని చెప్పాడు. వీరిద్దరి వివాహం ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ, నిన్న ఆయన విడుదల చేసిన ఫొటోలో, ఇద్దరూ దండలు వేసుకుని కనిపిస్తున్నారు. ఇదే పెళ్లికి సంబంధించిన చిత్రమా? అన్న విషయమై స్పష్టత లేదు. హార్దిక్ పెట్టిన చిత్రాలను చూసిన వారు ఒకింత షాక్ కు గురై, ఆ తరువాత తేరుకుని విషెస్ చెప్పారు.

"మేం కొత్త జీవితానికి స్వాగతం పలకనున్నాం. అందుకోసం మేమిద్దరం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. కొత్త దశలోకి అడుగు పెడుతూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం, దీవెనలు నాకు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా ఉంటుంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుందని నమ్ముతున్నా" అని చెప్పాడు. హార్దిక్ కు ఇప్పుడు ఇతర క్రికెటర్లు, ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Hardhik Pandya
Natasha
Marriage
Pregnent
Father

More Telugu News