Ponnam Prabhakar: వలస కార్మికుల ఉసురు బీజేపీ ప్రభుత్వానికి తగలకమానదు: పొన్నం

Ponnam Prabhakar fires on BJP
  • తెలంగాణ కోసం బీజేపీ ఏంచేసిందో చెప్పాలన్న పొన్నం
  • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
  • కరోనా విషయంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
బీజేపీపై కాంగ్రెస్ తెలంగాణ నేత పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. గల్లీలో కొట్లాడుతున్న బీజేపీ, ఢిల్లీలో మాత్రం దోస్తీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటునే తప్పుబట్టిన బీజేపీ, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏంచేసిందో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు.  తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని, బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగలకమానదని వ్యాఖ్యానించారు.
Ponnam Prabhakar
BJP
Migrants
Kishan Reddy
Congress

More Telugu News