Surgical Spirit: విశాఖ జిల్లాలో విషాదం.... మద్యం అనుకుని సర్జికల్ స్పిరిట్ తాగారు!

Three men dies of surgical spirit
  • ముగ్గురు మృత్యువాత
  • అక్కడిక్కడే మరణించిన ఇద్దరు
  • మరొకరు చికిత్స పొందుతూ మృతి
వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగించే సర్జికల్ స్పిరిట్ ను నాటుసారాగా పొరబడిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. చనిపోయిన వారిని అప్పారావు, నూకరాజు, ఆనంద్ గా గుర్తించారు.  

ఈ ఘటనతో కశింకోటలోని గోవిందరావు కాలనీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఐదుగురు వ్యక్తులు మద్యం అనుకుని సర్జికల్ స్పిరిట్ తాగారు. వారిలో ఇద్దరు వెంటనే చనిపోయారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ఆరంభించారు.
Surgical Spirit
Liquor
Visakhapatnam District
Death

More Telugu News