Chandrababu: సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu wishes Superstar Krishna on his birthday
  • నేడు కృష్ణ పుట్టినరోజు
  • కృష్ణకు శుభాకాంక్షలు వెల్లువ
  • ట్వీట్ చేసిన చంద్రబాబు
ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. తెలుగు చిత్రసీమలో సాహసోపేత నిర్ణయాలతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న గొప్ప కథానాయకుడిగా కృష్ణ చిరకాలం నిలిచిపోతారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కృష్ణకు విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయనకు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభించాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ స్పందించారు.
Chandrababu
Krishna
Birthday
Wishes
Tollywood

More Telugu News