nagababau: కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు చెబుతున్నాను: నాగబాబు

nagababu about krishna
  • సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు
  • మెగాస్టార్ రాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలు
  • అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు
  • నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్
సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి నాగబాబు పలు విషయాలు తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మేరకు ట్వీట్ చేశారు. 'నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్‌ శకం ప్రారంభం కాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్‌' అని అన్నారు.

'మొదటి 70 ఎంఎం, డీటీఎస్, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్‌ కలర్, స్పై సినిమాలు ఆయనవే. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేశారు' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
nagababau
krishna
Tollywood

More Telugu News