Doctor Sudhakar: డాక్టర్ సుధాకర్‌కు వైద్యం చేస్తున్న వైద్యుడి మార్పు!

Officials Changed the Doctor who is take care Doctor Sudhakar
  • డాక్టర్ సుధాకర్‌కు వైద్య సేవలు అందించనున్న డాక్టర్ మాధవీలత
  • ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో చికిత్స
  •  డాక్టర్ సుధాకర్ అభ్యంతరంతో మార్పు
విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడిని అధికారులు మార్చారు. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడి విషయంలో డాక్టర్ సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన స్థానంలో మరో మహిళా వైద్యురాలిని నియమించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత ఆయనకు వైద్యసేవలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, అంతకుముందు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి మాట్లాడుతూ తన కుమారుడిపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతోందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ కుమారుడిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Doctor Sudhakar
Visakhapatnam District
Narsipatnam

More Telugu News