Jayalalitha: ‘అమ్మ’ స్మారకం.. అదిరిపోయేలా.. జయ సమాధిని డిజైన్ చేస్తున్న చెన్నై ఐఐటీ

  • రూ. 5.08 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం
  • స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి పళనిస్వామి
  • జులై నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశం
Jayalalitha Memorial Hall construction may end in July

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారక మండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై మెరీనా బీచ్ ఒడ్డున అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సమాధి పక్కనే జయలలిత పార్దివదేహాన్ని ఖననం చేశారు. ఇప్పుడక్కడ రూ. 5.08 కోట్లతో జయ స్మారక మండప నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జులై నెలాఖరులోగా నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

జయలలిత సమాధిని చెన్నై ఐఐటీ డిజైన్ చేసింది. మండపం మధ్య ప్రదేశాన్ని కాంక్రీట్‌తో ఫినిక్స్ పక్షి ఆకారంలో తీర్చి దిద్దుతున్నారు. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను రెండు రోజుల క్రితం సీఎం పిలిపించుకుని పనులపై ఆరా తీశారు. ఎటువంటి హడావుడి లేకుండా పనులు పూర్తిచేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. జులై చివరి నాటికి పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని ఆదేశించారు.

More Telugu News