నాలుగోసారి కూడా విఫలం... భూమిపైనే పేలిపోయిన భారీ రాకెట్ 'స్టార్ షిప్'... వీడియో ఇదిగో!

31-05-2020 Sun 06:28
  • అంగారకుడిపైకి మానవులను పంపాలని ప్రయోగం
  • ఇప్పటికే మూడు సార్లు పేలిపోయిన స్టార్ షిప్
  • ఇంధనం మండించగానే, భారీ పేలుడు
Fourth Time Failed Star ship Video

అంగారకుడు, చంద్రుడిపైకి మానవులను పంపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న స్పేస్ ఎక్స్ మరోసారి విఫలమైంది. మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సంస్థ తయారు చేసిన నమూనా రాకెట్, నాలుగోసారి పేలిపోయింది. టెక్సాస్ లోని సంస్థ ప్రయోగకేంద్రం నుంచి రాకెట్ ను ప్రయోగించాలని చూడగా, ఇంధనాన్ని మండించగానే అది భారీ శబ్దంతో నేలపైనే పేలిపోయింది.

ఈ విషయాన్ని వెల్లడించిన స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, ప్రస్తుతానికి స్టార్ షిప్ ప్రయోగాన్ని పక్కన పెడుతున్నామని తెలిపారు. ఇకపై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వ్యోమగాములను పంపే మిషన్ పై దృష్టి సారిస్తామన్నారు. కాగా, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐఎస్ఎస్ లోకి ఆస్ట్రొనాట్స్ ను తీసుకుని వెళ్లాలని భావించిన ఈ ప్రయోగం, వాతావరణం బాగాలేని కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.