కేరళలో పేదలకు ఫ్రీగా ఇంటర్నెట్ సౌకర్యం!

30-05-2020 Sat 21:50
  • 'కె ఫోన్' ప్రాజెక్టు చేపడుతున్న కేరళ
  • రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్
  • డిసెంబరు నుంచి ఇంటర్నెట్ సేవలు
Kerala decides to provide free internet for poor

అక్షరాస్యత విషయంలో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచే రాష్ట్రం కేరళ. కరోనా కట్టడి విషయంలోనూ ఈ రాష్ట్రం ముందుంది. అంతేకాదు, రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా ఇంటర్నెట్ అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 'కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్' (కె ఫోన్) ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే డిసెంబరు నుంచి నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 దీనిపై సీఎం పినరయి విజయన్ వివరణ ఇచ్చారు. ఇంటర్నెట్ సౌకర్యం పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని భావిస్తున్నామని, మరే రాష్ట్రంలోనూ పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ ఇవ్వడం లేదని తెలిపారు. 'కె ఫోన్' ప్రాజెక్టు ద్వారా పేదలకు ఉచితంగా, ఇతరులకు వేర్వేరు ధరల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెప్పారు.