మందుబాబుకి కడుపునొప్పి.. ఎక్స్ రే చూసిన డాక్టర్లకు మైండ్ బ్లాక్!

30-05-2020 Sat 20:49
  • మందు బాటిల్ ను పురీషనాళంలోకి ఎక్కించుకున్న వైనం
  • నేరుగా పెద్దపేగులోకి వెళ్లిన బాటిల్
  • నా జీవితంలో ఇలాంటి కేసును చూడలేదన్న సర్జన్
Bottle found in XRay of a drinker

మందు బాబు చేసిన పనికి డాక్టర్లు షాక్ అయ్యారు. కాసేపు నోట మాట కూడా రాలేదు. అసలేం జరిగిందంటే తమిళనాడులోని నాగపట్టణం ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 27న ఓ మందుబాబు వచ్చాడు. కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్లకు చెప్పాడు. దీంతో అతనికి పరీక్షలు చేయించిన డాక్టర్లు.. అతని ఎక్స్ రే చూసి షాక్ కు గురయ్యారు. 250 మి.లీ. మందు బాటిల్ ఎక్స్ రేలో కనిపించింది. దీనిపై డాక్టర్లు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

మద్యం మత్తులో బాటిల్ ను పురీషనాళంలోకి ఎక్కించుకోవడంతో.. అది నేరుగా పెద్దపేగులోకి వెళ్లిపోయింది. దీంతో అతను నరకయాతన అనుభవించాడు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. చివరకు నొప్పిని భరించలేక ఆసుపత్రికి వచ్చాడు.

ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ సర్జన్ పాండియరాజ్ మాట్లాడుతూ, ఎక్స్ రే చూసి షాకయ్యామని చెప్పారు. తన కెరీర్ లో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని అన్నారు. పొరపాటున సీసా పగిలి ఉంటే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేదని చెప్పారు.