తల్లి ఎలుక దెబ్బకు బెంబేలెత్తి పారిపోయిన పాము.. వీడియో ఇదిగో!

30-05-2020 Sat 19:41
  • పిల్ల ఎలుకను నోట కరుచుకుని పోబోయిన పాము
  • పాముపై పోరాటం చేసిన తల్లి ఎలుక
  • వీడియో చూసి ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు
Mother rat chases away snake to protect baby

ఎలుక కనిపిస్తే పాము గుటుక్కున మింగేస్తుంది. అందుకే పామును చూడగానే ఎలుకలు దొరకనంత దూరం పరుగెత్తుతాయి. కానీ, ఓ ఎలుక తన బిడ్డను కాపాడుకోవడానికి ఏకంగా పాముపైనే యుద్ధం చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఓ చిన్న ఎలుకను పాము నోట కరుచుకుని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లబోయింది.

దీన్ని చూసిన తల్లి ఎలుక... క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాముతో పోరాడింది. తన బిడ్డను వదిలేంత వరకు వదల్లేదు. దీంతో, బెంబేలెత్తిన పాము నోట్లో ఉన్న చిట్టెలుకను వదిలేసి... పొదల్లోకి పారిపోయింది. అయినా కూడా తల్లి ఎలుక దాన్ని వదలకుండా వెంటాడింది. ఆ తర్వాత వెనక్కి వచ్చి తన బిడ్డతో కలసి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన జనాలు 'ఔరా' అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.