హీరోయిన్ తాప్సీ ఇంట్లో విషాదం

30-05-2020 Sat 19:26
  • ఈరోజు తుదిశ్వాస విడిచిన తాప్సీ నానమ్మ
  • ఆవేదనను అభిమానులతో పంచుకున్న తాప్సీ
  • పాత తరాల వారు మనకు శూన్యాన్ని వదలి వెళతారని భావోద్వేగం
Taapsee Pannus paternal grandmother dies

సినీ హీరోయిన్ తాప్సీ ఇంట్లో విషాదం నెలకొంది. తాప్సీ వాళ్ల నానమ్మ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా తన ఆవేదనను తాప్సీ అభిమానులతో పంచుకుంది. కుటుంబంలోని పాత తరాల వాళ్లు మనకు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని వదలి వెళతారు అని ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫొటోను పంచుకుంది.

2010లో 'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా తాప్సీ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు తమిళం, హిందీ చిత్రాలలో నటించింది. ఒక మలయాళ చిత్రంలో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రస్తుతం మూడు హిందీ, ఒక తమిళ చిత్రంలో ఆమె నటిస్తోంది.