దేశంలో జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు
- మరోసారి లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం
- రేపటితో ముగియనున్న నాలుగో విడత లాక్ డౌన్
- రాత్రివేళ కర్ఫ్యూ కుదింపు
నాలుగో విడత లాక్ డౌన్ రేపటితో ముగియనుండడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. తాజాగా మరికొన్ని సడలింపులు కూడా చేశారు. రాత్రివేళ కర్ఫ్యూను 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కుదించారు. ఇక, కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాల్స్, షాపింగ్ మాళ్లను తెరిచే అంశంలోనూ కేంద్రం వెసులుబాటు ఇచ్చినట్టు తెలుస్తోంది. మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 తర్వాత పునఃప్రారంభం అవుతాయని భావిస్తున్నారు.