ఆ పోస్టులకు, నాకు ఎలాంటి సంబంధం లేదు: రావు రమేశ్

30-05-2020 Sat 18:15
  • సోషల్ మీడియాలో నాకు అకౌంట్లు లేవు
  • నా పేరు మీద పోస్టులు పెడుతున్నారు
  • త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా
I dont have socia media account says Rao Ramesh

తన పేరు మీద సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని... వాటికి, తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటుడు రావు రమేశ్ తెలిపారు. తనకు ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎలాంటి అకౌంట్ లు లేవని చెప్పారు.

తన పేరు మీద ప్రతి రోజు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని... వాటిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. ఏదైనా విషయం ఉంటే పత్రికాముఖంగా తానే తెలియజేస్తానని తెలిపారు. తన పేరు మీద తప్పుడు పోస్టింగులు పెడుతున్న వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పారు.