ఇప్పటికే చాలా విన్నారు.... అసలు విషయమేంటో రేపు తెలుస్తుంది: మహేశ్ బాబు

30-05-2020 Sat 17:16
  • పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ కొత్త చిత్రం
  • రేపు అధికారిక ప్రకటన
  • ఉదయం 9.09 గంటలకు ప్రకటిస్తామన్న మహేశ్ బాబు
Mahesh Babu new movie announcement

మహేశ్ బాబు 27వ చిత్రం ఫైనలైజ్ అయింది. దీనికి పరశురామ్ దర్శకత్వం వహిస్తారు. చిత్రం పేరు సర్కారు వారి పాట అని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంపై రేపు అధికారిక ప్రకటన ఉంటుందని హీరో మహేశ్ బాబు వెల్లడించారు.

ఇప్పటికే దీని గురించి అనేక సంగతులు వింటున్నారని, అసలు విషయం తెలుసుకునేందుకు కౌంట్ డౌన్ మొదలైందని ట్వీట్ చేశారు. మే 31 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అసలు విషయం చెబుతామని తెలిపారు. రేపు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు తన కొత్త చిత్రం ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లతో కలిసి మహేశ్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇందులో మహేశ్ పక్కన అందాలొలికించే భామ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఇతర తారాగణం త్వరలో ప్రకటిస్తారు.