డేవిడ్ వార్నర్ టిక్ టాక్ డ్యాన్సులపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు

30-05-2020 Sat 16:03
  • మరో టిక్ టాక్ వీడియో చేసిన వార్నర్
  • మైండ్ బ్లాక్ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్
  • తెలుగు ప్రజలకు వినోదం అందిస్తున్నారన్న అనిల్
Anil Ravipudi comments on David Warner tik tok video

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో తెలుగు పాటలకు వీర లెవెల్లో డ్యాన్సులు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా, మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని 'మైండ్ బ్లాక్' పాటకు తన భార్యతో కలిసి వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది.

దీనిపై ఆ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఈ ఏడాది ఐపీఎల్ లేకపోయినా డేవిడ్ వార్నర్ అందరికీ వినోదం అందిస్తున్నాడని తెలిపారు. ఈసారి ఐపీఎల్ కాస్తా తెలుగు ప్రజల కోసం 'డబ్ల్యూటీపీఎల్' (వార్నర్ టిక్ టాక్ ప్రీమియర్ లీగ్)గా మారిపోయిందని అనిల్ తనదైన శైలిలో అభివర్ణించారు. అంతేకాదు, వార్నర్ అర్ధాంగి క్యాండిస్ డ్యాన్స్ కు తాను ముగ్ధుడ్నయినట్టు వెల్లడించారు. వార్నర్ తదుపరి వీడియో కోసం ఎదురుచూస్తుంటానని తెలిపారు.