అనితర సాధ్యుడు మా జగనన్న: రోజా

30-05-2020 Sat 14:41
  • సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి
  • జగన్ పై రోజా ప్రశంసల వర్షం
  • ఆడపడుచుల ఆత్మబంధువు అంటూ వ్యాఖ్యలు
Roja praises CM Jagan

ఏపీలో వైసీపీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే రోజా సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు అంటూ జగన్ ను కొనియాడారు. సీఎం జగన్ ఏడాది పాలనను స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన నిర్వచనం అంటూ అభివర్ణించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన అనితర సాధ్యుడు సీఎం జగన్ అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. అత్యధిక శాతం సంక్షేమ ఫలాలను మహిళలకే అందిస్తూ ఆడపడుచుల ఆత్మబంధువై నిలిచారని ప్రస్తుతించారు.