ఈ కోర్సు చేయాలనుకుంటే.. గడ్డం బాబును సంప్రదించండి: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

30-05-2020 Sat 14:39
  • భారతరత్న పేరుతో ఎన్టీఆర్ ను ఆటపట్టిస్తున్నారు
  • ప్రధానులను చేశానని చెప్పుకునే వ్యక్తి ఇలా చేయడం నీచాతినీచం
  • 'కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా?' అనే కోర్సు నేర్చుకోవాలంటే గడ్డం బాబును  కలవండి
Vijayasai Reddy criticizes Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా పరోక్ష విమర్శలు గుప్పించారు. బతికినోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించడాన్ని మనం చూస్తూనే ఉంటామని... 25 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం... ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమేనని చెప్పారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఏటా తీర్మానం చేస్తారని... ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం అని అన్నారు.

'కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా?' అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆన్ లైన్ కోర్సులను జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే... మన నెగెటివ్ థింకింగ్ పితామహుడు గడ్డం బాబును సంప్రదించవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.