ఇచ్చిన మాటను అమలు చేస్తున్నానని దైవసాక్షిగా మరోసారి ప్రమాణం చేస్తున్నా: సీఎం జగన్

30-05-2020 Sat 14:30
  • జగన్ పాలనకు ఏడాది పూర్తి
  • ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడి
  • మేనిఫెస్టో తనకు పరమపవిత్రం అని పేర్కొన్న సీఎం జగన్
CM Jagan takes oath again in the wake of one year completion

మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి, ఆరు కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నానని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతల సమక్షంలో మరోసారి ప్రమాణం చేశారు.

"వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబసభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. తనకు మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని... మేనిఫెస్టోను పరమపవిత్రంగా భావిస్తూ ఏడాది పాలన సాగించామని తెలిపారు.