ఏపీలో కొత్తగా 70 మందికి కరోనా పాజిటివ్

30-05-2020 Sat 14:15
  • గత 24 గంటల్లో 9,504 శాంపిల్స్ పరీక్ష
  • ఇవాళ 55 మంది డిశ్చార్జి
  • 2092 మంది కోలుకున్నట్టు వెల్లడి
Seventy more corona positive cases in AP

ఏపీలో గత 24 గంటల్లో 9,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. కొత్త కేసుల్లో మూడింటికి కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక గడచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు. ఇక, విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.