మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

30-05-2020 Sat 14:12
  • ఏడాది పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
  • త్వరలోనే భారత్ స్వావలంబన సాధిస్తుంది
  • ఈ ఏడాది ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను మన దేశం చూసింది
Pawan Kalyan greets Modi

ప్రధానిగా రెండో సారి బాధ్యతలను చేపట్టిన మోదీ... ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీకి గ్రీటింగ్స్ చెపుతూ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ట్వీట్ చేశారు.

'ఏడాది పాలనలో సాహసోపేతంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ప్రభుత్వంలో ఉన్నవారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది మన దేశం చరిత్రాత్మక నిర్ణయాలను చూసింది. త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. మోదీ అద్భుతమైన నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్ దే అవుతుంది' అని ట్వీట్ చేశారు.