ధోనీపై కీలక వ్యాఖ్యలు చేసిన సయ్యద్ కిర్మాణి

30-05-2020 Sat 13:51
  • ధోనీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం లేదు
  • సాధించాల్సిందంతా ఇప్పటికే సాధించాడు
  • సాధించడానికి మిగిలింది ఏమీ లేదు
Dhonis career is over says Syed Kirmani

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోనీ కెరీర్ ముగిసినట్టేనని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే అంశంపై భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి స్పందించారు.

ధోనీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన భవిష్యత్తు గురించి ధోనీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. సాధించాల్సిందంతా ధోనీ సాధించేశాడని తెలిపారు. ధోనీ ఇంకా సాధించాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే... అదే అతనికి చివరి టోర్నీ అవుతుందని అన్నారు.