చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్.. బుద్ధా వెంకన్న కౌంటర్!

30-05-2020 Sat 13:05
  • కరోనా కాలంలో కుట్రలు చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి
  • కుట్రలపై కోర్సు చేయాలనుకుంటే గడ్డం బాబుని సంప్రదించవచ్చని ఎద్దేవా 
  • విజయసాయరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టిన బుద్ధా
budda venkanna criticises vijay sai reddy

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న చురకలంటించారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 'కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్ లైన్ కోర్సులు జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగటివ్ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

జూమ్ యాప్‌ ద్వారా తమ నేతలతో చంద్రబాబు చర్చిస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బుద్ధా వెంకన్న... 'ఈయన గారు అద్దంలో మొహం చూసుకొని ట్వీటినట్టున్నాడు' అంటూ ఎద్దేవా చేశారు.