మోదీ పేరుకి కొత్త అర్థం చెప్పిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

30-05-2020 Sat 12:40
  • 'ఎం' అంటే మోటివేషన్  
  • 'ఓ' అంటే అపార్చునిటీ
  • 'డి' అంటే డైనమిక్‌ లీడర్‌షిప్
  • 'ఐ' అంటే ఇన్‌స్పైర్ తో పాటు ఇండియా
shivraj on midi

కేంద్రంలో ప్రధాని మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దీనిపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ స్పందించారు. ఆయన పేరులోనే మంత్రం ఉందన్నారు. 'ఎం' అంటే మోటివేషన్ (ప్రేరణ) అని, భారతదేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు మోదీ పని చేస్తూ, మనకి ప్రేరణనిస్తున్నారని ఆయన తెలిపారు.

'ఓ' అంటే అపార్చునిటీ (అవకాశాలు అందిపుచ్చుకోవడం) అని, అభివృద్ధి కోసం భారత్‌లో దాగి ఉన్న అవకాశాలను బయటకు తీసుకువచ్చేందుకు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక 'డి' అంటే డైనమిక్‌ లీడర్‌షిప్‌ అని, 'ఐ' అంటే ఇన్‌స్పైర్ తో పాటు ఇండియా అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో స్వావలంబనను ప్రోత్సహించేలా ఆయన మనకు స్ఫూర్తినిస్తున్నారని చెప్పారు.