గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారు: జగన్

30-05-2020 Sat 12:26
  • పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చూస్తోంటే కోర్టుకెెళ్లి అడ్డుకుంటున్నారు
  • ఇటువంటి ప్రతిపక్షాన్ని ఇక్కడే చూస్తున్నాం
  • ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు
  • మనందరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది
  • ఈ సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉంది
jagan on tdp

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ రైతులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చూస్తోంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రతిపక్షాన్ని ఇక్కడే చూస్తున్నాం. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. మేము మేనిఫెస్టోలో చెప్పనవే కాకుండా చెప్పకుండా అమలు చేసినవీ 40 అంశాలున్నాయి' అని వ్యాఖ్యానించారు.

ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ రైతుభరోసా కేంద్రాల్లో లభ్యం అవుతాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైసీపీది. మనందరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.