david warner: మహేశ్ బాబు పాటకు భార్యతో కలసి అదిరిపోయే స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్!

david warner tiktok dancing
  • ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు టిక్‌టాక్
  • అభిమానుల కోరికను నెరవేర్చిన డేవిడ్
  • వైరల్ అవుతున్న స్టెప్పులు

తెలుగు సినిమా పాటలకు భార్యతో కలిసి స్టెప్పులేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ రోజు మరోసారి డ్యాన్సుతో ముందుకొచ్చారు. మహేశ్ బాబు నటించిన‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు టిక్‌టాక్‌ చేయాలని వార్నర్‌ను అభిమానులు కోరారు.

దీంతో తాను డ్యాన్సు చేస్తానని ఆయన నిన్న ప్రకటించాడు. చెప్పినట్లే తన భార్యతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇది పార్ట్‌ -1 అని చెప్పాడు. కొన్ని రోజులుగా టిక్‌టాక్‌ వీడియోలతో ఆయన సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు పాటలకు ఆయన వేస్తోన్న స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News