రాష్ట్ర స్వరూపాన్నే జగన్‌ మార్చేశారు: సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసలు

30-05-2020 Sat 11:42
  • సీఎం జగన్‌ విజన్‌ ఉన్న గొప్ప నేత 
  • సంక్షేమం అనేది వైఎస్సార్‌‌ కుటుంబానికే సాధ్యం
  • మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను జగన్ అమలు చేశారు
  • విమర్శలు చేసేందుకే చంద్రబాబు మహానాడు నిర్వహించారు
sajjala on jagan

సీఎం జగన్‌ విజన్‌ ఉన్న గొప్ప నేత అని, సంక్షేమం అనేది వైఎస్సార్‌‌ కుటుంబానికే సాధ్యమని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి‌ నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా  సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... ఏపీ‌ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయిందని, రాష్ట్ర స్వరూపాన్ని జగన్‌ మార్చేశారని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను జగన్ అమలు చేశారని ఆయన అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారని, జగన్‌పై విమర్శలు చేసేందుకే చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించారని ఆయన తెలిపారు. జగన్ ఒక్కసారి‌ మాట ఇస్తే దాన్ని అమలు చేసి చూపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి జగన్ ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత చక్కగా సుపరిపాలన కొనసాగిస్తారని ఆయన తెలిపారు.