Lockdown 5.0: హైదరాబాద్ సహా 13 నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు.. మిగతా చోట్ల ఎత్తివేత?

  • కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు
  • జూన్ 1 నుంచి తెరుచుకోనున్న మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు?
  • ‘మన్‌ కీ బాత్’లో రేపు వెల్లడించనున్న ప్రధాని
Lockdown may Extend in Hyderabad and 12 other cities

దేశంలో మరో విడత లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కేసులు ఉద్ధృతంగా ఉన్న నగరాలు మినహా మిగతా చోట్ల లాక్‌డౌన్ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి  సరికొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ ఎత్తేసిన మరుక్షణం హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లను తెరిచేందుకు జూన్ 1 నుంచే అనుమతి ఇస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

లాక్‌డౌన్  కొనసాగించే నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణె, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్‌పట్టు, తిరువల్లూరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగరాల్లో మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశలున్నాయని చెబుతున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అది దశలవారీగానే ఉంటుందని సమాచారం. రేపు ప్రధాని ‘మన్ కీ బాత్’లో లాక్‌డౌన్ 5.0కి సంబంధించిన విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.

More Telugu News