యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్న దర్శకేంద్రుడు!

30-05-2020 Sat 09:20
  • గతేడాది సినిమా ప్రకటించిన రాఘవేంద్రరావు 
  • ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు దర్శకుల చిత్రం 
  • ఆ సినిమా తప్పకుండా ఉందన్న దర్శకేంద్రుడు 
Young hero gets chance in Raghavendraraos film

దర్శకుడిగా కె.రాఘవేంద్రరావుది టాలీవుడ్ లో ఓ చరిత్ర!
ఆయన చేసిన సినిమాలు మామూలు సినిమాలు కావు.. కొట్టిన హిట్లు మామూలు హిట్లూ కావు. తెలుగు సినిమాకి గ్లామర్ అద్ది, కమర్షియల్ చిత్రాలకు గ్రామర్ చెప్పిన రాఘవేంద్రరావు గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నారు.

ముగ్గురు కథానాయికలు, ముగ్గురు దర్శకులతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన గతేడాది ప్రకటించారు. అయితే, ఆ తర్వాత దాని గురించి మళ్లీ అప్ డేట్ ఏమీ లేదు. దాంతో ఈ చిత్రాన్ని ఆయన డ్రాప్ చేసుకుని ఉంటారని అంతా భావించారు.

అయితే, ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు చెబుతానన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని యంగ్ హీరో నాగశౌర్య దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే వాస్తవమైతే కనుక, నాగశౌర్య కెరీర్ ఊపందుకుంటుందని చెప్పచ్చు!